బెన్ఫిట్ షోలు రద్దు చేసి ప్రత్యేక షోలకి అనుమతేలా ఇచ్చారు..! 6 h ago
"గేమ్ ఛేంజర్" సినిమాకు టికెట్ రేట్ల పెంపు, బెన్ఫిట్ షోల పై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్యా బెన్ఫిట్ షోలకు ఇచ్చిన అనుమతి పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెన్ఫిట్ షోలు రద్దు చేసి, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెన్ఫిట్ షోలకు అనుమతించవద్దని న్యాయస్థానం సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్ సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం జరిగిందని వ్యాఖ్యానించింది. ఈ విషయం పై తదుపరి విచారణ జనవరి 24వ తేదికి వాయిదా వేసింది.